కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు శిక్షణ కేంద్రం ఏర్పాటు, నిర్వహణకు ఏపీఏడీసీఎల్ టెండర్లను ఆహ్వానిస్తోంది. బిడ్ల దాఖలుకు జనవరి 10 సాయంత్రం 4 గంటల వరకు గడువుగా నిర్దేశించింది.
ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.25.11 కోట్లు ఖర్చవుతుందని అంచనా. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూములను 20 ఏళ్ల పాటు లీజు విధానంలో ఏపీఏడీసీఎల్ కేటాయిస్తుంది.