పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్న ఓ బాలిక గర్భనిరోధక మాత్రలు వేసుకుని మృత్యువాత పడింది. బ్రిటన్‌కు చెందిన లైనా ఖాన్ (16) అనే బాలికకు పీరియడ్స్ సమయంలో తీవ్ర నొప్పి రావడంతో స్నేహితుల సూచనల మేరకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంది.
దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెకు వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్టు చెప్పారు. డిసెంబర్ 13న ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. అయినా ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ప్రకటించారు.