హెచ్‌ఎల్‌సీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ ఇన్చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. హెచ్‌ఎల్‌సీ నీటిని విడుదల చేయకపోవడంతో పెద్దవడుగూరు మండలంలో వేల ఎకరాల్లో పత్తి మిరప పంట నష్టపోయిందని రైతులు వాపోయారు. పెద్దవడగూరు మండలంలో మిర్చి రైతులకు నీరు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి బైఠాయించిన నిరసనకు దిగారు. దీతో బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి పూర్తిగా దిగ్బంధించారు. రోడ్డుకి ఇరువైపులా రైతుల ఆందోళన నేపథ్యంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు ఆందోళన వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండలను పెట్టి రైతులు ఆందోళనకు దిగారు. వేల ఎకరాల్లో పంట నష్టపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వద్దకు చేరుకుంటున్న పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం కన్పిస్తోంది.