దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 341 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. కేరళలోనే 292 కొత్త కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కరోనాతో కేరళలో ముగ్గురు చనిపోయినట్లు పేర్కొంది.
ఇక తమిళనాడులో 13 మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, తెలంగాణలో 4, పుదుచ్చేరి 4, ఢిల్లీలో 3, గుజరాత్లో 3, పంజాబ్, గోవాలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.