యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న బహిరంగ సభకు 110 ఎకరాల స్థలంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా.. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. విజయోత్సవ సభ నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశారు. స్టేజీ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు.. స్టేజీపై 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అభిమానులు ప్రత్యేక రైళ్లలో విజయనగరం చేరుకోనున్నారు. ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు, విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. భోగాపురం వచ్చే అన్ని వైపులా భోజన ఏర్పాట్లు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. విజయోత్సవ సభకు పలు ప్రాంతాల నుండి హాజరయ్యే వారికి పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.