నాన్న నామీద ఆశ పెట్టుకోకండి ఇకమీదట మీరు హ్యాపీగా ఉండండంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాలకే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై బాలాజీనాయక్ తెలిపిన వివరాల మేరకు లేపాక్షి మండలం గలిబిపల్లికి చెందిన సందీప్ (25) అనే యువకుడికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆర్థిక పరిస్థితులు మరికొన్ని కుటుంబ సమస్యల కారణంగా బుధవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.