ఒంగోలులోని గోపాల్ నగర్ సచివాలయం పరిధిలో గోపాల్ నగర్, పీకే స్ట్రీట్ అంగన్వాడి కేంద్రాన్ని నగర కమిషనర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు, బాలింతలు, ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు అందించు పౌష్టికాహారం గురించి విచారించారు. సరుకుల నిల్వ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రం పరిధిలోని గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.