విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెమీక్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిధిగా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి హాజరై క్రిస్‌మస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్. జగన్ మాట్లాడుతూ......క్రిస్మస్ వస్తున్న శుభసందర్భంలో ఈ సాయంత్రం పూట అడ్వాన్స్‌గా క్రిస్మస్‌ను జరుపుకుంటున్నాము. ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్నగా, తమ్ముడిగా మెర్రీ క్రిస్‌మస్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa