ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అమెరికాలోని కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు రాతలు రాశారు. నివార్క్లోని స్వామి నారాయణ్ మందిరం గోడలపై గ్రాఫిటీతో రాతలు రాశారు.
దీనికి సంబంధించిన ఫోటోను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని నివార్క్ పోలీసులు తెలిపారు. ప్రజలను భయపెట్టేందుకు గోడలపై విద్వేషపూరిత రాతలు రాసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది.