జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీనియర్ ఆర్మీ, పోలీస్ ఆఫీసర్లు ఆ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు, అదనపు బలగాలు మోహరించాయి.
శనివారం ఉదయం నుంచి పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. విస్తృత స్థాయిలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రెండు ఆర్మీ వాహనాలపై జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.