ఏపీలో రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధత, ఓట్ల జాబితాపై, టీడీపీ - వైసీపీలు చేస్తున్న ఆరోపణలపై 18 మంది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇచ్చారు.
ఈ రోజు మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది.