వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ కోసం ఈనెల 2న దరఖాస్తు చేసుకున్న రైతు వద్ద నుంచి రూ.70 వేలు లంచం తీసు కుంటూ శుక్రవారం ఏసీబీ వలకు విద్యుత్‌శాఖ సబ్ ఇంజనీర్ చిక్కాడు. రాజమహేంద్రవరం ఏసీబీ అడి షనల్ ఎస్పీ కె.సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన ముళ్లపూడి శ్రీనివాసరావు మావయ్య ముత్యాల గోపాలకృష్ణకు వ్యవసాయ భూమి ఆలమూరు రోడ్డులో ఉంది. ఆ పొలానికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మండపేట సమీపంలో ఉన్న మారేడుబాక సబ్‌స్టేషన్‌ను సంప్ర దించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ లైన్ ఎస్టిమేట్‌తోపాటు తనకు రూ.70 వేలు లంచం ఇవ్వాలని విద్యుత్ శాఖ సబ్‌ఇంజనీర్ డిమాండ్ చేశాడు. శ్రీనివాస్‌తో పాటు మరో రైతు రఘు కూడా విద్యుత్ కార్యాలయం చుట్టూ కనెక్షన్ కోసం తిరిగారు. కానీ సబ్‌ఇంజనీర్ దుర్గాప్రసాద్ విద్యు త్ కనెక్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవడం, లంచం డిమాండ్ చేయడంతో ముళ్లపూడి శ్రీనివాసరావు ఏసీబీ శాఖాధి కారులను ఆశ్రయించాడు. శుక్రవారం రాజమహేంద్రవరం ఏసీ బీ అడిషనల్ ఎస్పీ కె.సౌజన్య నేతృత్వంలో మారేడుబాక విద్యుత్ సబ్‌స్టేషన్‌పై దాడి చేశారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతు ముత్యాల గోపాలకృష్ణ వద్ద నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్‌ను పట్టుకున్నారు. అతడు తీసుకున్న లంచం నగదును స్వాధీ నం చేసుకున్నారు. ఈమేరకు సబ్‌ఇంజనీర్‌పై కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టుకు హాజరుపరు స్తామని ఆమె తెలిపారు. పట్టుపడ్డ దుర్గా ప్రసాద్, గతంలో పిఠాపురం విద్యుత్ సబ్ స్టేషన్‌లో లైన్‌మన్‌గా పనిచేసి మారేడుబాక సబ్‌స్టేషన్‌కు ఏడాదిన్నర కిందట పదోన్నతిపై సబ్ ఇంజనీర్‌గా వచ్చాడు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వాసుకృష్ణ, శ్రీనివాస్, సతీష్, ఎస్‌ఐ విల్సన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.