వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తలు బారులు తీరారు. తెల్లవారుజామున 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది. ఉదయం 5:15 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. తెల్లవారుజామునే శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. వారిలో సుప్రీం కోర్టు మాజీ సీజె ఎన్వీ రమణ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, హిమా కోహ్లీ, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విశ్వరూప్, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, నాగేశ్వరావు, గుడివాడ అమర్నాథ్, జయరాం, ఉషశ్రీ చరణ్, నాగార్జున, వేణుగోపాల కృష్ణ, రాజన్న దొర, కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గేహ్లాట్, ఎంపీలు రఘురాం రాజు, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, మిథున్ రెడ్డి, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్, నటుడు రాజేంద్ర ప్రసాద్, రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.