కన్న తండ్రి కూతురిపై 4 నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేసిన ఘటన కారంపూడి మండలంలో శనివారం వెలుగు చూసింది. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తిని అతని భార్య 10 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లింది.
దీంతో 15 ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అత్యాచారం చేస్తూ వచ్చాడు. బాలిక కడుపు నొప్పితో వైద్యులను సంప్రదించడంతో గర్భవతిగా నిర్ధారించారు. ఈ అమానవీయ ఘటనపై కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa