ఎంటీఎంసీ నగర పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చించివేసినట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు జాతీయ రహదారి వెంబడి
ఈ నెల 10వ తేదీన నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ముందురోజు రాత్రి గుర్తుతెలియని దుండగులు చించివేశారు. మరలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా 13వ తేదీ రాత్రి మరో మారు దుండగులు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కార్యాలయ ఇంచార్జ్ కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.