ప్రేమ త్యాగ నిరతికి చిహ్నం క్రిస్మస్ పండుగని, కులమత బేధం లేకుండా అందరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి తెలిపారు. ఒంగోలులోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో శనివారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఈవో డిపిఓ హాజరయ్యారు. అలాగే కార్యనిర్వహణ అధికారి శివప్రసాద్, పలువురు పాల్గొన్నారు.