రైతు సుభిక్షంగా ఉంటే అందరూ సుభిక్షంగా ఉండాలని రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమని జిల్లా జెడిఎ శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య ఎన్జీరంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో జాతీయ రైతు దినోత్సవాన్ని శనివారం ఒంగోలులోని ఎన్జీరంగా భవన్ లో నిర్వహించారు. వ్యవసాయంలో చోటుచేసుకుంటున్న మార్పులపై రైతులు అవగాహనతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.