ఒంగోలులోని శర్మ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారంతో అట్టహాసంగా ముగిశాయి. కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ పోటీలలో జిల్లాలోని వివిధ కళాశాలల జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సమైక్య విజేతలు ఆంధ్ర స్టడీ సర్కిల్, ఏఎస్ఆర్ కళాశాల జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వారికి రాయపాటి జగదీష్ బహుమతులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa