రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో చెక్ పోస్టులు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని ఒంగోలు ఆర్టీవో విశ్వేశ్వర రావు తెలిపారు. ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో శనివారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నివేదిక తయారు చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.