ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూఇయర్ వేడుకల కోసం బకెట్లలో భారీగా మద్యం బాటిళ్లు.. ఇంతలోనే భారీ ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 08:06 PM

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారుతుంది. ఈ నేపథ్యంలో దీనిని సొమ్ముచేసుకోడానికి ముఠాలు అప్పుడే రంగంలోకి దిగాయి. పోలీసులను ఏమార్చి మద్యం సరఫరా చేయడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని వడోదర నగరంలో పోలీసుల కంటబడకుండా మద్యం సీసాలను పోలీసులు బకెట్లలో దాచి ఉంచారు. కానీ, ప్రెవెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ (పీసీబీ) పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. మకరంద్ దేశాయ్ రోడ్డులోని ఓ బంగ్లాపై దాడి చేసిన పోలీసులు.. ఏకంగా 1,404 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.


పడవ ప్రయాణాల్లో ఉపయోగించే బకెట్లలో మద్యం బాటిళ్లను నిందితులు దాచిపెట్టారని పోలీసులు తెలిపారు ‘ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసిన బకెట్లలో మద్యం సీసాలను ఉంచారు. వాటిని బహిరంగంగా రవాణా చేస్తున్నారు. లూబ్రికెంట్ ఆయిల్ బకెట్లు వాడటంతో ఎవరూ అనుమానించలేదు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌డీ రటాడ తెలిపారు. ఘటనా స్థలిలో రితేష్ శుక్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడైన శంకర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. వివిధ పోలీస్ స్టేషన్లలో శుక్లాపై ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయని చెప్పారు.


కాగా, ఇటీవల ఎల్పీజీ కంటైయినర్‌లో భారీ మొత్తంలో మద్యాన్ని తరలిస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచడంతో మద్యం అక్రమ రవాణాకు నిందితులు కొత్త దారులను ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత పది నెలల్లో పీసీబీ రూ.1.20 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా, ఇటీవల సౌరాష్ట్రకు వెళ్తున్న ఎల్పీజీ ట్యాంకర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.50.06 లక్షల విలువైన 12,516 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఢిల్లీ-జైపూర్ హైవేపై షాపురా గ్రామం సమీపంలో పక్కా సమాచారంతో ఈ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన మేఘరామ్ జాట్ అనే డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సురేంద్రనగర్ జిల్లాలోని చోటిలా వైపు ట్యాంకర్‌ను తీసుకెళ్లాలని ఆదేశించినట్టు అతడు విచారణలో వెల్లడించాడు. మరో ఘటనలో ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో నలుగురు అంతర్ రాష్ట్ర మద్యం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.1 కోట్లు విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రక్కు, కారులో పంజాబ్, బిహార్‌లకు మద్యం తరలిస్తున్నట్టు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa