ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబ్‌క్యాలెండర్‌ ఏమైపోయింది జగన్..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 28, 2023, 03:33 PM

మోసం, నయవంచనకు సీఎం జగన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. పైకి విశ్వసనీయత అంటూ.. లోపల దగాకోరు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఆమె విలేకరులతో మాట్లాడుతూ..... జగన పాలన విధ్వంసాలతో ప్రారంభమైందని, నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. జగన చిత్తశుద్ధితో పాలన సాగించి ఉంటే రాజధానిగా ఇప్పటికే అమరావతికి మంచి గుర్తింపు ఉండేదని అన్నారు. కుట్రతోనే అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూశారని ఆరోపించారు. అమరావతి కోసం రైతులు భూములను త్యాగం చేస్తే, ఆ రైతులనే రోడ్డుకు ఈడ్చారని అన్నారు. మహిళా రైతులను లాఠీలతో కొట్టించి తీవ్ర అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన నమ్ముకున్న వారిని కూడా మోసం చేసిన ఘనుడని, సొంత బాబాయ్‌ని హత్య చేసిన వారిని కాపాడుతూనే... సొంత చెల్లి, తల్లిని దూరం పెట్టారని అన్నారు. కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేసిన జగన, తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలకూ అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన సొంత జిల్లా ప్రజలను మోసం చేశారని అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ లేదు, అన్నమయ్య డ్యాం బాధితులను ఆదుకున్నదీ లేదని అన్నారు. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కులను ధారాదత్తం చేసి, సీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ, కార్మిక లోకమంతా రోడ్డెక్కి నిరసనలు చేపడుతుంటే.. ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్రా అంటూ యువతను మోసం చేస్తున్నారని అన్నారు. ఏటా జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తానని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి.. యువతకు నమ్మకం ద్రోహం చేశారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa