రణస్థలం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం మాజీమంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో టిడిపి శ్రేణులతో కలిసి కళా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.