అయోధ్య రామ మందిరం.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయితే, ఈ రామ మందిరం మ్యాప్ 37 ఏళ్ల క్రితమే తయారుచేయబడింది.
అప్పటి ప్రణాళికలో కొన్ని మార్పులు చేసి ఆలయాన్ని మరింత పెద్దదిగా, మరింత అందంగా నిర్మిస్తోన్నారు. ఆలయ నిర్మాణం పూర్తై, భక్తులకు అందుబాటులోకి వస్తే.. అయోధ్యలోని రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం అవుతుంది.