వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వృద్ధులకు, మహిళలకు జగన్ ప్రభుత్వం రూ. 3 వేల పెన్షన్ ను అందించనున్నారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో జగన్ కు ఎవరూ సాటి రారు అనడానికి ఇదే నిదర్శనమని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ వెల్లడించారు. అయన మాట్లాడుతూ.... నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో జగన్ సీఎం అయిన తర్వాత రూ. 141 కోట్ల రూపాయలతో నాడు - నేడు పనులు చేపట్టి అభివృద్ధికి బాటలు వేసామని వివరించారు. అలాగే గిరిజన విద్యార్థుల ఉన్నత చదవులు చదువుకోవాలన్న సంకల్పంతో జగన్ గిరిజన ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. అలాగే నియోజవర్గంలో రూ. 6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, బ్రిటీష్ కాలం నుంచి రోడ్లు లేని గ్రామాలకు జగనన్న ప్రభుత్వంలో తారు రోడ్లు వేసి ఆదివాసీ ప్రాంతాలకు మహర్దశను కల్పించారన్నారు. గత ప్రభుత్వంలో కేవలం పసుపు చొక్కాలు వేసుకున్న వారు లంచాలు తీసుకుని పథకాలు ఇచ్చారని, జగన్ మాత్రం కుల, మతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. గిరిజనుల తలరాతలు తిరిగిరాస్తున్న జగన్ ను శాశ్వత ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు అంత్రాక్స్ వంటి వ్యాధులు ఏజెన్సీలో ప్రబలినపుడు పట్టించుకోలేదని, అలాగే ఈ ప్రాంతంలోని బాక్సైట్ వంటి వనరులను దోచుకోవాలని ప్రయత్నం చేయగా, పాదయాత్రలో ఉన్న జగన్ కు ఓ వినతిని ఇవ్వగా అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీఓని ఇచ్చారని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 200 సెల్ టవర్లు, ఏర్పాట్లు చేసామన్నారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న గ్రామాలకు బ్రిడ్జిలు లేకపోతే, 18 వంతనెలను రూ, 56 కోట్లతో నిర్మాణం చేపట్టామని వివరించారు. 39,450 మందిక ఆదివాసీలకు జగన్ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా దానికి రైతు భరోసాను కూడా కల్పించామని ఫాల్గుణ వెల్లడించారు.