ఆదివాసీల సీమలో వైయస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బస్సుయాత్రలో భాగంగా వచ్చిన ప్రజా ప్రతినిధులు అల్లూరి జిల్లా ఇన్ చార్జి మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎంపీ గొట్టేట మాధవి, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులు హూకుంపేట మండంలో నాడు - నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన అబివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం హుకుంపేట జంక్షన్ జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు.