వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ..... జగనన్న ప్రతి పేదవాడి గుండెలో ఆత్మబంధువుగా ఉన్నాడు. మాటిస్తే తప్పని నాయకుడు జగనన్న.అన్ని కులాలను దగ్గరకు తీసుకున్న ప్రజానాయకుడు జగనన్న. ఇచ్చిన మాట మీద ఏనాడు నిలబడని సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు. సిగ్గు పడాలి.ఈరోజు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు జగనన్న.ఆయా వర్గాలను వాడుకుని, తర్వాత అవమానించి, చులకనగా చూడటం చంద్రబాబు నీచరాజకీయం. ఈరోజు బీసీలను, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను అధికార పదవుల్లో పెద్దపీట వేసి కూర్చోపెట్టిన మన నాయకుడు జగనన్న. విద్యా, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి..పేద వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మహిళా సాధికారత విషయంలో జగనన్న ఎంతో చేశారు. ప్రతి మహిళను స్వంత అక్కాచెల్లెమ్మలుగా చూస్తున్నారు. వారి మొహాల్లో నవ్వులు చూడాలని ...వారికి ప్రత్యేకించి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇంటి స్థలాలు వారి పేరునే రిజిష్టరు చేసి పట్టాలిచ్చారు. చంద్రబాబును నమ్మితే..మనల్ని మనం మోసం చేసుకోవడం. మన సంక్షేమం, అభివృద్ధికి చేటుచేసుకోవడం. చంద్రబాబు మన బడుగు,బలహీనవర్గాలకు ఏం చేశాడో చూడండి. జగనన్న ఏం చేశాడో చూడండి తేడా మీకే తెలుస్తుంది. జగనన్నతో పోలికే లేని దరిద్రనాయకుడు చంద్రబాబు. జగనన్న కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల వర్గాలన్నీ కలిసి నిలబడాలి. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాల్లో వెలుగులు అని పిలుపునిచ్చారు.