వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ, సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల హామీలను నెరవేర్చడమే కాకుండా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతీ కుటుంబంలో ఓ సభ్యునిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారని, సీఎం జగన్ కూడా ఆయన కుమారుడుగా మరో రెండు అడుగులు ముందుకేసి అభివృద్ధికి బాటలు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. జగన్ అడుగులో అడుగు వేసి మళ్లీ మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.