అనంతపురంలోని కోర్టు రోడ్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో ఎం ఈ ఓ వెంకట స్వామీ యూ టీ ఎఫ్ డైరీ, క్యాలెండర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూ టీ ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, మనోహర్, గుజ్జల శివ ప్రసాద్, ఉషారాణి, జిల్లా కన్వీనర్ సుబ్బరాయుడు, అధ్యక్షులు చంద్రనాయక్, ఉపాధ్యక్షులు ముసలప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.