ఉరవకొండ మండలంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే యువతకు అర్బన్ సీఐ తిమ్మాయ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించిన, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి పెద్ద. పెద్ద శబ్దాలు చేసి, మద్యం మత్తులో వాహనాలు నడిపిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్లపై ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.