జమ్మూకశ్మీర్ పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదం, డ్రగ్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం అందించినా నగదు బహుమతి ఇస్తామని వెల్లడించారు.
డ్రగ్స్ వినియోగం, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడానికి సహాయపడే సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష నుంచి రూ.12.5 లక్షల వరకు బహుమతి ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారి గురించి చెప్తే రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు.