నేపాల్లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
రాజధాని ఖాట్మండ్కు తూర్పున 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.