ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామ సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బొలెరో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పవన్, రాహుల్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.