పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజు కు చేరుకుంది. ఈ సందర్బంగా అంగన్వాడీలు కబడ్డి ఆట ఆడి రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, రైతు సంఘం జిల్లా నాయకులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, ఐద్వా నాయకురాలు గౌతమి పాల్గొన్నారు.