భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల్లోని న్యూక్లియర్ కేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఈ ప్రక్రియ ఏకకాలంలో జరిగిందని తెలిపింది.
భారత్, పాక్ మధ్య ఉన్న న్యూక్లియర్ కేంద్రాలపై దాడుల నిషేధ ఒప్పందం కింద ఈ జాబితాలను ఇరు దేశాలు మార్చుకున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే ఈ ఒప్పందం 1988లో జరుగగా..1991లో అమలులోకి వచ్చింది.