అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(NCMC) రూపే రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డ్‌ను తీసుకొచ్చింది.
ఎన్సీఎమ్సీతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్, పార్కింగ్ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్ ప్రీపెయిడ్ కార్డ్ ఉపయోగపడుతుందని బ్యాంక్ తెలిపింది.