రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2023 జూన్ నుంచి డిసెంబరు వరకు విద్యార్థుల హాజరు శాతం 78.12గా నమోదైంది. పాఠశాలలకు హాజరైన 78.12 శాతం విద్యార్థుల్లో 86.07 శాతం మంది
విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జగనన్న గోరు ముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే.