క్రీడల్లో రాణిస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి తెలిపారు. మంగళవారం మంగళగిరి మండలం కాజ, నిడమర్రు గ్రామాలలో ఆడుదాం ఆంధ్రా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి పోటీ పడడం శుభపరిణామన్నారు. గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ అద్భుత ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో గ్రామీణులు, పట్టణాలలో ఎంతో మంది యువకులు తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. మారుమూలన ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వారికి పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచి ఉన్నత స్థానాలను అవరోదించాలని కోరారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి గుండా మధు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.