ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పలు విధులలో చెత్త పేరుకుపోయింది. మున్సిపల్ కార్మికులు గత ఎనిమిది రోజులుగా వారి డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన దీక్షలు చేస్తున్నారు. దీంతో పట్టణంలో చెత్త ఎక్కడపడితే అక్కడ పేరుకు పోయింది. అంతేకాకుండా నివాసాలలో కూడా చెత్త సేకరించే కార్మికులు రాకపోవడంతో ఇల్లల్లో కూడా చెత్త పేరుకుపోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.