సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరులో ఈనెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహిస్తు న్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమావేశాల్లో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి కార్యచరణ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించడం వామపక్షాల ఐక్యతపై రాష్ట్ర సదస్సులో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్నారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికు లు, ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలమయ్యాడన్నారు. బీజేపీ రాష్ర్టానికి తీరని ద్రోహం చేసిందని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దాసోహమై రాష్ర్టానికి అన్యాయం చేస్తుందన్నారు. నూతన భూచట్టాన్ని తెచ్చి రైతులు, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని, దాన్ని బలప రిచే వైసీపీలను చిత్తుగా ఓడించాలని అన్నారు. జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ 9వ తేదీన ఆర్‌ఆర్.పేట కాశీవిశ్వేశ్వర కల్యాణ మండపంలో సదస్సు ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు.