కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీ ని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని.. ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని తెలిపారు. జగన్ని తిట్టడం.. రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డాన్స్ చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదన్నారు. వైఎస్ పేరుని చార్జిషీట్‌లో సోనియా పెట్టారని.. జగన్‌ను జైల్‌లో పెట్టారని.. వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారన్నారు. వైఎస్ తకు మధ్య గొడవలకు కారణం సోనియా అని చెప్పుకొచ్చారు. ఆమె ఆ పార్టీ నేతలతో పాద పూజ చేయించుకుంటుందన్నారు.దేశాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. ఏపీని సోనియా చంపేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో చేరాలన్నారు. కాంగ్రెస్‌లో ఎవరూ జాయిన్ కావద్దని కోరారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారన్నారు. ఎంపీ సత్యనారాయణ విశాఖలో ఆక్రమణలు చేసి.. నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేయలేనిది లోకేష్ వచ్చి ఏమి చేస్తారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి గెలిపించాలని.. విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని పాల్ విమర్శలు గుప్పించారు.
![]() |
![]() |