అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలో తేలనుంది. రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్లో పాల్గొనకుండా ట్రంప్‌పై నిషేధం విధించిన కొలరాడో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు దేశ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విచారణను త్వరితగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు.