అనంతపురంలోని జేఎన్టీయూ అతిథి గృహంలో శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి పలువురు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంగయ్య, కలెక్టర్ ఎం. గౌతమి, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ సి. నాగరాణి, డిఐజి ఆర్ఎన్. అమ్మిరెడ్డి, మేయర్ వసీం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్, రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.