బేస్తవారిపేట మండలం కోనపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం నాటుసార స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. దాడుల్లో కంభం సర్కిల్ సీఐ రాజేష్ కుమార్, బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ రాజేష్ కుమార్ అన్నారు.