మార్కాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎలిశెల. కోటేశ్వరరావు ఆదివారం పుల్లలచెరువులో ఎస్సై శ్రీహరిని స్థానిక పోలీస్ స్టేషన్లో కలిసి మండలంలో నెలకొన్న పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సంబందించిన సమస్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. చట్టప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.