ఎర్రగొండపాలెం మండల భవననిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా ఎస్కే. పీరా, కార్యదర్శిగా అన్వర్ బాషా లను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్కే పీరా మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, సీపీఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.