దేశంలో చలితీవ్రత రోజురోజుకూ పెరిగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, యపీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అలాగే పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోయింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.