ఎంబీఏ చదివినా బోధనకు అవకశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏఐసీటీఈ నిబంధనల మేరకు మేనేజ్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఎంబీఏలో 60శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి.
ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా యూనివర్సిటీలు పీహెచ్‌డీ ఉన్నవారినే అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. అత్యుత్తమ జర్నల్స్, అంతర్జాతీయ సమావేశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించిన వారికీ ప్రాధాన్యం ఉంటుంది.