అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం నుండి సోమవారం జిల్లాకు భారీగా తరలిన మున్సిపల్ కార్మికులు. జిల్లా నాయకుల పిలుపుమేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరినట్టు వారు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.