వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..... ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను ఓటుబ్యాంకుగానే చూశారు. సీఎం అయ్యాక బడుగు, బలహీనవర్గాలను తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీ వర్గాలను తన గుండెల్లో పెట్టుకుని...మన కోసం...మన మంచి కోసం ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. మన ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చి, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. వైద్యరంగంలోనూ పేదలకు గొప్ప అండగా ఉండేలా ఆరోగ్యశ్రీ స్థాయిని పెంచారు. రూ.25లక్షల వరకు వైద్య సేవలు అందేలా చేసారని అన్నారు.