వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ.... దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలుగన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు.